గంగూలీ బర్త్ డేకి సరప్రైజ్ చేసిన సచిన్ టెండ్కూలర్

బుధవారం, 10 జులై 2019 (20:35 IST)
జూలై 8 వతేదీ సౌరభ్ గంగూలీ పుట్టిన రోజు.. 42వ సంవత్సరంలో అడుగుపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా గంగూలీకి విషెష్ వెల్లువెత్తాయి. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాత్రం గుంగూలీకి సరప్రైజ్‌గా విష్ చేశాడు. చాలా అరుదైన ఫోటోను పోస్ట్ చేసి ట్విట్టర్లో గంగూలీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. 
 
గంగూలీ, సచిన్ అండర్ 15 క్రికెట్ మ్యాచ్ ఆడిన సందర్బంలో వారు ఇద్దరూ తీయించుకున్న ఓ ఫోటోను షేర్ చేశాడు. హ్యపీ బర్త్ డే ‘దాదా’. మన ప్రయాణం సుదీర్ఘ మైనది. అండర్ 15 జట్టుకు ఆడిన నాటి నుంచి నేటీ వరకూ మన ప్రయాణం ఇప్పుడు కామెంట్రీ వరకూ సాగుతోంది. ఇది నిజంగా గొప్ప ప్రయాణం అంటూ ట్వీట్ చేశాడు. నీకు భవిష్యత్‌లో మంచి జరగాలని కోరుకుంటున్నా అని తెలియజేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు