''నేసమణి''కి తర్వాత ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #SareeTwitter (video)

గురువారం, 18 జులై 2019 (16:15 IST)
ఇదేంటి అంటున్నారా? అవును నేసమణికి తర్వాత #SareeTwitter అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మనదేశంలో భారత సంప్రదాయంలో చీరకట్టుకు ప్రత్యేక స్థానం వుంది. చీరకట్టుకు భారత మహిళలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. పాశ్చాత్య ప్రభావంతో ఎన్ని ఫ్యాషన్ దుస్తులు వచ్చినా.. సంప్రదాయ చీరకట్టును మాత్రం భారతీయ మహిళలు నిర్లక్ష్యం చేయరు. 
 
ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా #SareeTwitter భారీగా ట్రెండ్ అవుతోంది. చీరకట్టులో ఓ మహిళ #SareeTwitter అనే హ్యాష్ ట్యాగ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్‌లో చాలామంది మహిళలు చీరకట్టుతో కూడిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇందులో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధికారులు పలువురు వున్నారు. 
 
ఇంకా విదేశీ మహిళలు కూడా చీరకట్టుతో కూడిన ఫోటోలను ఈ హ్యాష్ ట్యాగ్‌లో షేర్ చేస్తున్నారు. ఐ లవ్ శారీ అని పోస్టులు పెడుతున్నారు. ముందుగా #PrayForNesamani అనే హ్యాష్ ట్యాగ్ ఎలా ప్రపంచస్థాయిలో ట్రెండ్ అయ్యిందో.. ఇదే తరహాలో #SareeTwitter కూడా వైరల్ అవుతోంది.


 



వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు