బెంగుళూరు పరప్పణ జైలు నుంచి శశికళ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సిటీలోని ఒక రిసార్ట్స్‌లో ఆమె రెస్ట్ తీసుకుంటోంది. అది కూడా హోం క్వారంటైన్లో ఉంది శశికళ. ఈనెల 7వ తేదీ చెన్నైకు రావాలని శశికళ నిర్ణయించుకుంది. సుమారు నాలుగు సంవత్సరాల తరువాత చెన్నైకు వస్తున్న శశికళకు భారీ స్వాగతం పలికేందుకు ఆమె అభిమానులు సిద్థమవుతున్నారు.
ఇదంతా గమనిస్తున్న అన్నాడిఎంకే పార్టీ నేతల్లో భయం పట్టుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పళణిస్వామి, పన్నీరుసెల్వంలలో భయం మరింత పట్టుకుందట. అందుకు ముఖ్య కారణం పళణిస్వామిని ముఖ్యమంత్రి చేసింది శశికళనే. అయితే మొదట్లో విధేయుడిగా ఉన్న పళణిస్వామి ఆ తరువాత పూర్తిగా పన్నీరుసెల్వంతో కలిసిపోయి శశికళను దూరం పెట్టేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను పంపించేశారు.