జయలలితకు ఆలయం.. ఏడు అడుగుల ఎత్తు.. 40 కిలోల బరువు

శనివారం, 30 జనవరి 2021 (10:37 IST)
తమిళనాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఎలాంటి పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు. జయలలితను అక్కడి ప్రజలు అమ్మ అని పిలుస్తారు. అమ్మ మరణం తరువాత కూడా ఆమెకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 
 
తమిళనాడు రెవిన్యూశాఖామంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆలయం నిర్మించారు. మధురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో ఈ ఆలయం నిర్మించారు. 
 
ఈ ఆలయంలో మూలవిరాట్టులుగా అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్, జయలలిత విగ్రహాలు ఉంటాయి. ఒక్కో విగ్రహం ఏడు అడుగుల ఎత్తులో 40 కిలోల బరువుతో ఉంటాయి. 12 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 
 
కాగా, శనివారం ఈ ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది. ఇక అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు