తనను డబ్బింగ్ యూనియన్ నుంచి బహిష్కరించారని.. అదే సమయంలో గేయ రచయిత వైరముత్తు మాత్రం గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ సత్కారాలు పొందుతున్నారని ఫైర్ అయ్యింది. భారత సమాజంలో బాధితురాలికి న్యాయం జరగడం అంత సులభం కాదని చిన్మయి వెల్లడించింది. బాధితురాలు మరణిస్తే, హత్యకు గురయితేనే సమాజం సీరియస్‌గా పట్టించుకుంటుందని చిన్మయి వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం తాను సోషల్ మీడియా నుంచి అన్నిరకాల వేధింపులను ఎదుర్కొంటున్నానని.. నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారని.. ఓ రాత్రి గడిపేందుకు ఎంత తీసుకుంటావని అడుగుతున్నారని, కొందరు వ్యభిచారణి అంటూ దూషిస్తున్నారని తెలిపింది.