ఇది పురుగు కాదు.. పువ్వు.. వీడియో చూస్తే మీరే షాకవుతారు.. (Video)

బుధవారం, 15 జులై 2020 (18:40 IST)
Orchid Mantis
భూగోళం మొత్తాన్ని మానవుడు ఆక్రమించినా.. సృష్టిలో జీవివైవిధ్యం గురించి తెలుసుకోడానికి మానవుని జీవితం చాలదు. అందుకే సృష్టి చేతిలో మనిషి ఓడిపోతూనే వుంటాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతోమంది ఔత్సాహికులు ఎన్నో చిత్ర విచిత్రమైన వస్తువు, జంతువులు, పక్షులు.. ప్రకృతికి సంబంధించిన అరుదైన దృశ్యాలను షేర్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నందా ఒకరు. ఈయన ప్రకృతి అందాలను అరుదైన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 
 
సాధారణంగా పువ్వులు ఎన్నో రకాల ఆకృతిలో ఉంటుంటాయి. కొన్ని పువ్వులు జంతువులు, మనుషులు ఆకారంలో కూడా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో ఆర్కిడ్ పూలు కూడా ఒక‌టి. సుశాంత నందా ఈ పువ్వుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో ఈ పువ్వు పురుగు మాదిరి కదులూ కనిపించింది. ఈ పువ్వు క‌ద‌ల‌డ‌డానికి కార‌ణం ఒక పురుగు. ఈ కీట‌కం పువ్వులోనికి దూరి పువ్వులా రూపం మార్చుకుంది.
 
10 సెకన్ల పాటు నడిచే ఈ వీడియోలో పురుగు ఆకుపై క‌ద‌ల‌డం చూడొచ్చు. ఈ కీట‌కాన్ని ఆర్కిడ్‌ మాంటిస్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని పశ్చిమ కనుమలలో కనిపిస్తుంది. ఈ విచిత్ర‌మైన ఈ పువ్వుల వీడియోను సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేసిన గంటల్లోనే సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. ఇప్ప‌టిక‌వ‌ర‌కు 12కేకి మించిన వారు ఈ వీడియోను వీక్షించారు. ఈ పురుగుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

Walking orchids

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు