లోటస్ పాండ్‌లో కార్యకర్తలతో షర్మిల సమావేశం: కొత్త పార్టీ ప్రకటనకేనా?

మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల తెలంగాణలో ప్రాంతీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తున్నారా? లేక రాష్ట్రంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపచేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు? నగరంలోని లోటస్ పాండ్ నివాసంలో మంగళవారం నల్గొండకు చెందిన నాయకులతో ఆమె సమావేశం అవుతున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
 
ఈ సమావేశానికి షర్మిలతో పాటు అనిల్ కుమార్, తల్లి వైయస్ విజయమ్మ కూడా హాజరవుతారని వర్గాలు తెలిపాయి. మొదటి సమావేశం ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా నాయకులతో జరగనుంది. దివంగత వై.ఎస్.రాశశేఖరరెడ్డి అనుచరులతో ఈ సమావేశాన్ని ‘ఆత్మియ సమ్మేళనం’ (స్నేహపూర్వక సమావేశం) అని చెపుతున్నారు.
 
లోటస్ పాండ్ సమావేశం వార్తతో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారం చర్చల్లోకి వచ్చింది. మళ్లీ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త పార్టీ పెట్టే విష‌యంలో వైఎస్ ష‌ర్మిల సైలెంట్‌గా మూవ్ అవుతున్నారని చెప్పుకుంటున్నారు. మొన్నా మ‌ధ్య వ‌చ్చిన వార్త‌లకి కాస్త బ్రేక్ వేసే ప్ర‌య‌త్నాలు చేసినా.. ష‌ర్మిల మాత్రం పార్టీ పెట్ట‌డం లేదు అని.. స్ట్రెయిట్‌గా అయితే చెప్ప‌లేదు. 
 
అందుకే.. జ‌నాల్లో ఆ అనుమానాలు అలాగే ఉన్న‌య్. వాటికి తోడు.. ష‌ర్మిల పార్టీ పెడుతున్నారు అని.. ఆమె స‌న్నిహితులు బ‌య‌టికి చెప్ప‌డం లాంటివి చూస్తుంటే.. ప‌క్కా పార్టీ ఉంటుంది అంటున్నారు. ఇక పార్టీ పేరు కూడా ఫిక్స్ అయిందంట‌. వాళ్ల నాన్న పేరు మీదుగా ఏపీలో జ‌గ‌న్ పార్టీని స‌క్సెస్‌ఫుల్‌గా న‌డుపుతున్నారు. తెలంగాణ‌లో ష‌ర్మిల కూడా అదే పేరు మీద పొలిటిక‌ల్ పార్టీని స‌క్సెస్ చేయాలి అనేది ఆమె ప్లాన్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో జ‌నంలోకి వెళ్తార‌ట‌. 
 
అయితే.. ఈ పార్టీ పేరు వేరే వారు రిజిస్ట‌ర్ చేస్తార‌ని తెలుస్తోంది. వైసీపీ పార్టీ పేరు కూడా వేరే వాళ్లు రిజిస్ట‌ర్ చేసుకుంటే.. జ‌గ‌న్ తీసుకున్నారు. ఇక్క‌డ కూడా అంతే అనే టాక్ అయితే ఉంది. ముందే ఆమె పేరు మీద రిజిస్ట‌ర్ చేసుకుంటే పార్టీ పేరు బ‌య‌టికి వ‌స్తుంది. అదే వేరే వాళ్లు రిజ‌స్ట‌ర్ చేసుకుంటే.. అప్ప‌టిక‌ప్పుడు అనౌన్స్ చేసుకోవ‌చ్చు. త‌ర్వాత వారి పేరు మీద ఉన్న పార్టీని.. వీరు తీసుకోవ‌చ్చు. ష‌ర్మిల విష‌యంలో కూడా ఇదే జ‌ర‌గ‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది.
 
ఇక నినాదం కూడా ప‌క్కాగా ఉంది. తెలంగాణ‌లో కూడా వైఎస్‌కు అభిమానులు బాగానే ఉన్నారు. ఇప్ప‌టికీ ఓ వ‌ర్గం వారు.. వైఎస్సార్‌ను అభిమానిస్తూనే ఉంటారు. ఇక జ‌గ‌న్ ఫ్యాన్స్ కూడా తెలంగాణ‌లో సంఖ్య భారీగానే ఉంటుంది. వాళ్లు ఏ పార్టీలో ఉన్నా.. జ‌గ‌న్ గానీ బ‌య‌టికొస్తే వాళ్లంతా బ‌య‌టికొస్తారు. సో.. ష‌ర్మిల వ‌స్తే వాళ్లంతా ష‌ర్మిల వెనుక న‌డుస్తారు అనేది ప్లాన్. అందుకే.. నినాదం కూడా.. రాజ‌న్న రాజ్యం.. జ‌గ‌న‌న్న సంక్షేమం అని ఉంటుందంట‌.
 
సో.. పార్టీని న‌డిపేది ష‌ర్మిల అయినా.. జెండా ప‌ట్టేది ష‌ర్మిల అయినా.. జెండా మీద ఉండేది మాత్రం రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలే. మ‌రి త‌ర్వాత త‌ర్వాత పార్టీని వైసీపీలో క‌లిపేస్తారా లేదా అనేది వ‌దిలేస్తే.. వైసీపీకి ఇది తెలంగాణ వింగ్ లాగే అనిపిస్తోంది. కాక‌పోతే.. వేరే పార్టీగా రాబోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. చూద్దాం. ఎంతవ‌ర‌కు ఇలా సీక్ర‌సీ మెయిన్‌టేన్ చేస్తారో. అయితే.. మ‌రో రెండు నెల‌ల్లోనే.. పార్టీ అనౌన్స్ మెంట్ అవుతుంద‌ని.. దానికంటే ముందే జ‌నంలోకి ఫుల్ క్లారిటీస్ ఇస్తార‌ని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు