నేను పార్టీ పెట్టడం లేదు, ఎందుకీ నీతిమాలిన చర్య: వైఎస్ షర్మిళ ఆగ్రహం

సోమవారం, 25 జనవరి 2021 (22:52 IST)
అన్నకు పోటీగా చెల్లెలు పార్టీ పెడుతోంది. ఆమె పార్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకుంది. త్వరలోనే పార్టీ పెడుతుంది. జనంలోకి వెళుతుంది. పాదయాత్ర చేపడుతుంది. ప్రజలను తనవైపు తిప్పుకుంటుంది. తన తండ్రి రాష్ట్రానికి చేసిన సేవను ప్రజల్లోకి తీసుకెళుతూ యాత్ర సాగుతుంది.
 
ఇదంతా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చర్చ. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ అన్న, చెల్లెల్లు ఎవరో.. వై.ఎస్.జగన్, షర్మిళ. అన్నతో పొసగక చెల్లెలు షర్మిళ సొంత పార్టీవైపు మ్రొగ్గు చూపుతోందని ప్రచారం జరిగింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేసుకుందంటూ ప్రచారం జరిగింది.
 
ఇక మిగిలింది కొత్త పార్టీతో రంగప్రవేశమే అంటూ ఊదరగొట్టారు. కానీ దీనిపై ఆలస్యంగా స్పందించారు షర్మిళ. కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము అంటూ ప్రకటన విడుదల చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు