శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడడం సరికాదని, తాను ఓ మంత్రినని, కానీ తన అభిప్రాయం ప్రకారం తనకు పూజించే హక్కు ఉందని.. కానీ అలాంటి ప్రదేశాన్ని అపవిత్రం చేసే హక్కు మాత్రం వుండదని చెప్పారు. ఈ రెండింటికి మధ్య వున్న తేడాను గుర్తించి.. గౌరవించాల్సిన అవసరం వుందని తెలిపారు.
అంతేగాకుండా అది మన విజ్ఞతకు సంబంధించిన విషయమని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని మండిపడ్డారు. తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన స్మృతి.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేశారు. కుర్చీలో కూర్చున్న ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోరు కూడా మూసేశారు.
గతంలో ఆమె నటించిన ''క్యూంకీ సాస్ భీ కభి బహూ థీ'' అనే సీరియల్‌లోని ఫోటోను పోస్టు చేశారు. దీనికింద ఆమె తానేదైనా మాట్లాడితే ఎప్పుడూ వాగుతూనే ఉంటానని అంటారని క్యాప్షన్ రాశారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌కు ఫిదా అవుతున్నారు. ఒక్క ఫొటోతో తానేం చెప్పాలనుకున్నారో దానిని స్పష్టంగా చెప్పేశారని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి ఫోటో వైరల్ అవుతోంది.