తితిదే మమ్మల్ని తీసుకోవడంలేదు: ప్రధాని మోదీకి రమణదీక్షితులు వినతి

గురువారం, 28 జనవరి 2021 (20:17 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి సేవ చేసే వ్యక్తుల్లో ప్రధానమైన వారు రమణదీక్షితులు, డాలర్ శేషాద్రి. పెద్ద డాలర్ వేసుకునే అర్చకులు డాలర్ శేషాద్రి. ఆయన్ను చేస్తూ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఇలా రెండవ వారు రమణదీక్షితులు. వంశపారపర్యంగా రమణదీక్షితులు కొన్ని యేళ్ళ పాటు ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగారు.
 
శ్రీవారికి సంబంధించిన కైంకర్యాలను స్వయంగా చేశారు. అయితే 2018 సంవత్సరంలో చట్టవిరుద్ధంగా వంశపాపరంపర్య పూజారులను పదవీ విరమణ చేయించినట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా రమణదీక్షితులు ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపారు. 
 
హైకోర్టు ఆదేశాలు ఉన్నా మమ్మల్ని ఈరోజు వరకు టిటిడి తిరిగి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోను రమణదీక్షితులు ఇదేవిధంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేయడం.. అదికాస్త వైరల్‌గా మారడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ప్రధానమంత్రికి చేసిన ట్వీట్లో రామమందిర నిర్మాణానికి 50 వేల రూపాయల సహాయం కూడా చేస్తున్నట్లు చెప్పి మరీ తన సమస్యను విన్నవించుకున్నారు.
 

@narendramodi Balaji 's blessings to you sir. Offered Rs50,000 from my humble savings for Bhavya Ram mandir for Maryada purushotham Ram.Naidu govt retired us hereditary priests illegally in May 2018. We were not taken back by TTD till today in spite of high court orders. Pl help

— Ramana Dikshitulu (@DrDikshitulu) January 28, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు