ఎలాన్ మస్క్‌తో ట్విట్టర్ చర్చలు.. విక్రయించడం సాధ్యమేనా?

సోమవారం, 25 ఏప్రియల్ 2022 (14:28 IST)
ఎలాన్ మస్క్ ధన బలం కలిగిన వ్యక్తి కావడం, ట్విట్టర్‌లో నూరు శాతం వాటాలు కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులకు ఏర్పాట్లు కూడా చేసుకోవడం తెలిసిందే. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తానంటూ ఆయన నెల క్రితం ఆఫర్ ప్రకటించారు. 
 
అప్పటి నుంచి ట్విట్టర్ బోర్డు మల్లగుల్లాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాన్ మస్క్‌తో నేరుగా చర్చించడం ఒక్కటే మార్గమని ట్విట్టర్ బోర్డు భావించనట్టుంది. ఆదివారం ఉదయం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. 
 
కంపెనీని ఎలాన్ మస్క్‌కు విక్రయించడం సాధ్యమేనా? అన్న అంశాన్ని ట్విట్టర్ బోర్డు పరిశీలిస్తున్నట్టు తెలిపాయి. చర్చలు ప్రారంభించడం అంటే.. మస్క్ ఒక్కో షేరుకు ఆఫర్ చేసిన 54.20 డాలర్ల బిడ్‌ను కంపెనీ ఆమోదిస్తున్నట్టు కాదని పేర్కొన్నాయి.
 
ఎలాన్ మస్క్ గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వాటాదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన బిడ్‌కు మద్దతు కూడగట్టే పనిని చేపట్టారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు