హనుమజ్జయంతి రోజున వానరం.. చిరు ట్విట్టర్ మారింది.. వీడియో వైరల్

శనివారం, 16 ఏప్రియల్ 2022 (16:02 IST)
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవిని కొరటాల శివ ‘ఆచార్య’గా సినిమాలోనే కాకుండా ట్విట్టర్‌లోనూ మార్చేశారు. చిరంజీవి ట్విట్టర్ ఖాతా పేరును ‘ఆచార్య’గా మార్చుకున్నారు. ఇంకా చెర్రీకి సంబంధించి మనసుకు హత్తుకునే ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
చిరంజీవికి స్వతహాగా హనుమంతుడంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. ఇవాళ హనుమ జన్మదినం పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. ఆ వీడియోను అందరితోనూ పంచుకున్నారు.  
 
కాటేజీలో మేకప్ వేసుకుంటూ చెర్రీ రెడీ అవుతున్నాడు. అక్కడకు హనుమ ప్రతిరూపమైన ఓ వానరం వచ్చింది. మేకప్వేసుకున్నంత సేపు అక్కడే తారాడింది. 
 
మేకప్ వేసుకోవడం పూర్తయిన తర్వాత చరణ్.. ఆ వానరానికి బిస్కెట్లను అందించాడు. ఆ వీడియోకు హనుమ శ్లోకమైన ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ను బ్యాగ్రాండ్‌గా చిరంజీవి పెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు