ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. ఈ వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా లక్షలాది మంది చనిపోయారు. ఈ వైరస్ నుంచి రక్షించేందుకు సరైన టీకా ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. అయితే, ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు, ఒకవేళ వైరస్ సోకినా ప్రాణహాని లేకుండా ఉండేందుకు మాత్రం కరోనా టీకాలను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో కొవిడ్-19కు కళ్లెం వేసే కొత్తరకం ఎన్95 మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఈ మాస్క్ వైరస్ వ్యాప్తిని తగ్గించడమే కాకుండా వైరస్‌ను చంపేస్తుంది. పైగా, ఈ మాస్కును ఎక్కువ కాలం వాడొచ్చు. ఎన్95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్ ఫిల్టర్లలోకి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీ మైక్రోబియల్ పాలీమర్లను విజయవంతంగా జోడించడం ద్వారా రెన్‌సెలీర్ పాలీటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.