మొత్తంమీద కొత్త మోటార్ వాహనాల చట్టం-2019 సామాన్యులకు నరకం చూపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించకపోయినా ఆటోలో హెల్మెట్ పెట్టుకోలేదనీ, బైక్‌పై సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు చలానాలు రాస్తుండటంతో ప్రజలు సొంత వాహనాలను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చెందిన హసన్ అనే రైతు తన పొలం వద్ద ఎద్దుల బండిని నిలిపిఉంచాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసులు.... హసన్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడని అనుమానించారు. అనంతరం హసన్ ఇంటికి వెళ్లి రూ.1,000 జరిమానాను అందజేశారు. దీంతో తిక్కరేగిన హసన్.. 'అసలు ఎద్దులబండి మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి ఎలా వస్తుంది?' అంటూ తీవ్రంగా మండిపడ్డాడు.