ఖాకీలు కాదు.. కర్కోటకులు... ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదనీ...

శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (15:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించారు. ఓ వాహనచోదకుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదన్న అక్కసుతో రోడ్డుపై పడేసి చితకబాదారు. బూటు కాళ్లతో తన్నారు. భారీ కాయంతో ఉండే ఓ కానిస్టేబుల్ బాధితుడి భుజంపై కూర్చొన్నాడు. తొడలపై బూటు కూళ్ళతో నిలబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని అతనిపట్ల ఇద్దరు పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అతడిని రోడ్డుపైకి ఈడ్చి కాళ్లతో తన్నుతూ దాడి చేశారు.
 
ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భౌతిక దాడులకు దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం సీరియస్‌గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు వీడియోను పరిశీలించి బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారు. 

 

#WATCH: Man thrashed by two police personnel in Siddharthnagar over alleged traffic violation. UP Police have taken cognisance of the incident and suspended the two police personnel. (Viral video) pic.twitter.com/0dWvnSV0lL

— ANI UP (@ANINewsUP) September 13, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు