పైగా, ఈ మొత్తాన్ని ఈ నెల ఏడో తేదీలోపు చెల్లించని పక్షంలో పాఠశాలకు కరెంట్ కట్ చేస్తామంటూ విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై ఈబీ అధికారులను వివరణ కోరగా, సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగానే ఈ పొరపాటు జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ స్కూలుకు తప్పుడు కరెంటు బిల్లులు రావడం ఇదే ప్రథమం కాదనీ, గతంలోనూ ఇదే విధంగా వచ్చిందని వారు చెబుతున్నారు.