బాబోయ్... మేమేదో చాలీచాలని అద్దె ఇళ్లలో బతుకుతుంటే మా దగ్గర చెత్త పన్ను ఏంటి అని ప్రశ్నిస్తే... ఇది కార్పొరేషన్ జారీ చేసిన ఆదేశం. మీరు నెలవారీ అద్దె చెల్లించినట్లే నెలకు రూ. 120 చెత్త పన్ను కట్టాల్సిందేనని దబాయించి ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి చెత్త పన్ను కట్టేందుకు సిద్ధంగా వుండమని చెప్పేసి వెళ్లిపోతున్నారు.
దీనిపై పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇళ్ల వద్ద పెద్దఎత్తున వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. చెత్త పన్ను కట్టేదేంటి... మేం కట్టం పోండి. మీ చేతనైంది చేసుకోండి. ఇదిగో ఇవాళే ఇల్లు ఖాళీ చేసి మా ఊరికి వెళ్లిపోతున్నాం అని కొంతమంది అద్దె ఇళ్లలో వుండేవాళ్లు వాదులాడుతున్నారు. మరోవైపు తమ వీధుల్లోకి చెత్తను తీసుకెళ్లే వాహనాలు రావడం లేదని, అలాంటప్పుడు చెత్త పన్ను ఎందుకు కట్టాలంటూ మరికొందరు వాదనకు దిగుతున్నారు.