టాప్ మోడల్స్‌ను తలదన్నే ఎన్నికల అధికారిణి.. నెట్టింట ఫోటోలు వైరల్ (video)
సోమవారం, 13 మే 2019 (13:01 IST)
సోషల్ మీడియాలో అందాల ఎన్నికల అధికారికి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. లేత పసుపు రంగు చీర, మ్యాచింగ్ స్లీవ్ లెస్ జాకెట్, కళ్లద్దాలు పెట్టుకుని, జారవిడిచిన కురులతో కనిపించింది.
ఇంకా ఓ చేత్తో సెల్ ఫోన్, మరో చేత్తో ఈవీఎంను పట్టుకుని, ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తున్నట్లుగా నడిచి వెళ్తున్న ఓ ఎన్నికల అధికారిణి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల అధికారిణి ఇంత అందంగా వున్నారోనని యూత్ కామెంట్లు పెడుతున్నారు.
ఇకపోతే.. ఎన్నికల విధులకు ఆమె వెళుతున్న వేళ, తుషార్ రాయ్ అనే ఫొటో జర్నలిస్ట్ ఆమె చిత్రాలను తీశారు. టాప్ మోడల్స్‌ను తలదన్నేలా ఉన్న ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేశారు.
ఈలోగా ఆమె జైపూర్‌లో విధులకు వచ్చారని, ఆమె పనిచేసిన బూత్‌లో 100 శాతం ఓటింగ్ నమోదైందని వార్తలు పుకార్లు చేశాయి. ఇంతలో ఆమె ఎవరో కూడా తేల్చేశారు.
ఆమె పేరు రీనా ద్వివేది అని గుర్తించారు. లక్నో, పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారని కనిపెట్టేశారు.
ఇకపోతే.. తన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ద్వివేది కూడా స్పందించారు. ఈ నెల 5న తనకు లక్నోలోని 173వ నంబర్ బూత్‌లో డ్యూటీ పడిందని, అప్పుడు ఈ ఫోటోలు తీశారని, ఇవి వైరల్ కావడంతో తనతో సెల్ఫీలు కావాలంటూ ఎంతో మంది అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.
ఇది తనకు కాస్తంత పాజిటివ్‌గా, మరికొంత నెగటివ్‌గా అనిపిస్తోందని చెప్పారు. తాను పని చేసిన బూత్ లో 100 శాతం పోలింగ్ అవాస్తవమని, కేవలం 70 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు.