దేశంలో కంప్యూటర్లు - ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై నిషేధం...

గురువారం, 3 ఆగస్టు 2023 (19:58 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ కారణంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ధరలు పెరగనున్నాయి. ప్రధానంగా చైనా, కొరియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లపై నిషేధం పక్కాగా అమలు చేయనున్నారు. 
 
ఒక వేళ విదేశాలకు చెందిన కంపెనీలు లేదా స్వదేశీ కంపెనీలు విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నిషేధం విధించిన దిగుమతుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు, అల్ట్రా స్మాల్ కంప్యూటర్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి. ఈ నిషేధ ఉత్తర్వులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేరిట జారీ అయ్యాయి. వీటిని హెచ్.ఎస్.ఎన్ కోడ్ 8471 కింద నిషేధం విధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు