మహాభారత కాలంలో కర్ణుడు చేసిన దానం గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అయితే, ఇపుడు ఈ కలియుగ కర్ణుడు గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు.. వెండితెరపై ప్రతినాయకుడు, నిజ జీవితంలో రియల్ హీరో సోనూ సూద్.
తాజాగా ఓ కుటుంబ ఆదాయ వనరైన గెదె చనిపోవడంతో వారికి మరో గేదెని కొనిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే వారి కోసం కొత్త గెదెను కొన్నప్పుడు కలిగిన ఆనందం, నా తొలి కారు కొన్నప్పుడు కలగలేదంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకు బీహార్ వచ్చినప్పుడు ఆ గెదె పాలు గ్లాస్ తాగుతానంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
కరోనా వైరస్ కష్టకాలంలో బీహార్ చంపారన్‌లోని భోలా గ్రామానికి చెందిన ఒక కుటుంబం గతంలో సంభవించిన వరదల్లో తమ కుమారుడుతో పాటు.... కుటుంబ ఏకైన ఆదాయ వనరు అయిన గేదెను కోల్పోయింది. ఈ విషయం సోనూసూద్ దృష్టికి చేరడంతో వెంటనే కొత్త గెదెని వారికి అందేలా తక్షణ చర్యలు చేపట్టాడు. దీంతో ఆ కుటుంబం ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.