దేశంలో.. ఇటీవల కాలంలో డీటీహెచ్ సర్వీసులు కీలకంగా మారుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో ఈ డీటీహెచ్ రంగం ఎనలేని అభివృద్ధిని సాధించింది. ఈ అభివృద్ధిలో డీటీహెచ్ సేవలు అందిస్తున్న సంస్థల మధ్య విపరీతమైన పోటీ పెరిగిందనడంలో సందేహం లేదు.
ఇందులో భాగంగానే.. ప్రముఖ రిలయన్స్ బిగ్ టీవీ.. పండుగ సీజన్ వస్తున్న సందర్భంగా దక్షిణ భారత మార్కెట్ల కోసం ఓ కొత్త ఆఫర్ను ఇస్తోంది. వినియోగదారులకు... మరిన్ని ఛానెళ్లు మరియు మరిన్ని వివిధ ఎంపికలు రూ. 2,590 వద్ద అందించేందుకు రిలయన్స్ బిగ్ టీవీ ముందుగు వచ్చింది.
ఈ దక్షిణ స్థానిక ప్యాకేజీలో కొత్త కొత్త స్థానిక ఛానెళ్లను సైతం రిలయన్స్ పరిచయం చేయనుంది. ఇందులో ఉషా టీవీ (కన్నడ), ఆదిత్యటీవీ (తమిళం), జీసీవీ (తెలుగు) వంటివి ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దక్షిణాది వినియోగదారుల కోసం.. రూ. 127 వద్ద సన్ బ్రాంజ్ పేరిట రిలయన్స్ బిగ్ టీవీ ఈ ఆకర్షణీయమైన డీటీహెచ్ ఆఫర్ చేస్తోంది.