ఈ రోజున శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ పండుగ వేళ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:30 గంటలకు కొత్త బట్టలు ధరించి.. ఉగాది పచ్చడి తయారు చేసుకుని తినడానికి శుభ సమయం అని పండితులు చెబుతున్నారు. విశ్వవాసు శాపం వల్ల గంధర్వుడు కబంధుడిగా మారిపోయాడు. రామాయణంలో కబంధుని ప్రస్తావన వస్తుంది.
అంతేకాదు ఉగాది రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి తదితర శుభప్రదమైన వస్తువులను కొనుక్కోవచ్చు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం 39వది. ఈ సమయంలో విశేష ధనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
పురాణాల ప్రకారం, నారదుడి 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని విష్ణువు వరం ఇస్తారు. ఆ 60 మంది పిల్లలే తెలుగు సంవత్సరాలని చెబుతారు. ఉగాది పచ్చడిని తప్పకుండా కుటుంబసభ్యులతో కలిసి తినాలని పురాణాలు చెబుతున్నాయి. మామిడికాయ, చింతపండు, బెల్లం, వేపపువ్వు, ఉప్పు, కారం కలిపి ఉగాది పచ్చడిని తయారుచేస్తారు.