అన్నదాతకు వరం.. రుణదాతకు ఖేదం

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (12:08 IST)
వివిధ బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించిన మరుక్షణమే స్టాక్ మార్కెట్‌లో ప్రధాన బ్యాంకుల షేర్లు ఒక్క సారిగా కుప్పకూలాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో మాఫీ చేసే రుణం సుమారు నాలుగు శాతం మేరకు వుండటం వల్ల ఈ ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

భారతీయ స్టేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, జమ్మూ అండూ కాశ్మీర్ బ్యాంకు, యూకో బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, విజయా బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆప్ ఇండియా పాటు మరికొన్ని ప్రధాన బ్యాంకుల షేర్లు పడిపోయాయి. అలాగే సెన్సెక్స్ కూడా దారుణంగా పడిపోయింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పాఠం పూర్తయ్యే సమయానికి మార్కెట్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ భరిత వాతావరణం మార్కెట్‌లో నెలకొంది.

వెబ్దునియా పై చదవండి