ఆదాయపన్ను పరిమితి రూ.1.50 లక్షలకు పెంపు

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (12:52 IST)
ఆదాయపన్నుదారులపై కూడా ఆర్థిక మంత్రి చిదంబరం కరుణ చూపించారు. గత ఏడాది కేవలం పది వేలు మాత్రమే ఆదాయపన్ను పరిమితిని పెంచిన ఆర్థిక మంత్రి ఈ దఫా మాత్రం దానికి నాలుగు రెట్లు పెంచారు. 2008-09 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో విత్తమంత్రి పేర్కొన్నట్టుగా.. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల ఆదాయ పన్ను పరిమితిని రూ.1.95 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు పెంచారు. ఇకపోతే వివిధ పార్టీల జయాపజయాల్లో కీలక పాత్ర పోషించే మహిళల ఆదాయపన్ను పరిమితిని కూడా పెంచారు.

వీరికి 1.50 లక్షల నుంచి రూ.180 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే కార్పోట్ ఆదాయపన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేపట్టలేదని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇదిలావుండగా.. సేవా పన్నుల రంగంలోకి కొత్తగా మరో నాలుగు రంగాలను తీసుకొచ్చారు. అలాగే.. దేశ వ్యాప్తంగా గల ఆస్పత్రులకు, అలాగే.. యునెస్కో హెరిటేజ్ ప్రదేశాలుగా ప్రకటితమైన హోటళ్ళకు కూడా ఈ టాక్స్ హాలిడేను ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి