కామన్‌వెల్త్ క్రీడలకు రూ.624 కోట్లు

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (16:41 IST)
వచ్చే 2010లో జరుగనున్న కామన్‌వెల్త్ క్రీడల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి 624 కోట్ల రూపాయలను కేటాయించారు. న్యూఢిల్లీలో ఈ వేడుకలు జరుగనున్నాయి. క్రీడల నిర్వహణకు మరో 947 రోజుల సమయం మాత్రమే వున్నందున క్రీడల నిర్వహణకు అవసరైన సదుపాయాలను మెరుగైన ప్రమాణాలతో కల్పించాలని ఆయన కోరారు.

జాతీయ వ్యవసాయ బీమాకు రూ.644 కోట్లు
జాతీయ వ్యవసాయ బీమా పథకానికి 644 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి కేటాయించారు. ఈ పథకం ఖరీఫ్, రబీ సీజన్‌లోని పంటలకు కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు. వాతావరణ సంబంధిత పంటల బీమా పథకానికి మంత్రి చిదంబరం రూ.50 కోట్లను కేటాయించారు. ఈ పథకం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.

అలాగే రైతులకు అవసరమైన ఎరువులను సబ్సీడీలో ప్రభుత్వం అందజేయనున్నట్టు చెప్పారు. గత ఏడాది ప్రారంభించిన రీ ప్లాంటేషన్, రెజువెనేషన్ ‌కింద టి పంటకు రూ.40 కోట్లను కేటాయించారు. వీటితో పాటు.. ఇతర ఉద్యానవన మెక్కలైన యాలగల పంటకు రూ.10.68 కోట్లు, రబ్బర్ రూ.19.41 కోట్లు, కాఫీ పంటకు రూ.18 కోట్లు కేటాయిస్తున్నట్టు విత్తమంత్రి చిదంబరం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి