పేదలకు ఆరోగ్య బీమా.. చిదంబరం

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (11:33 IST)
దారిద్యరేఖకు దిగువున వుండే పేద ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆయన 2008-09 వార్షిక బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఇందులో ఆరోగ్యం, విద్యా రంగాలకు 20 శాతం నిధులను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఆరోగ్య రంగానికి ఈ దఫా 15 శాతం నిధుల మేరకు పెంచారు.

ఆరోగ్య రంగానికి మొత్తం 16,534 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధుల్లో రూరల్ హెల్త్ మిషన్‌కు 462 కోట్లను కేటాయించారు. ఎన్‌ఆర్ఈజిసి పథకాన్ని దేశంలోని 596 గ్రామీణ జిల్లాలకు విస్తరించనున్నట్టు ప్రకటించారు. ఈ పథకానికి 1600 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌కు భారీ స్థాయిలోనే కేటాయించారు.

వెబ్దునియా పై చదవండి