వంద పాయింట్ల మేరకు తగ్గిన స్టాక్ మార్కెట్

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (11:43 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వార్షిక బడ్జెట్ ‌ప్రసంగం ప్రారంభించగానే దేశ స్టాక్ మార్కెట్ వంద పాయింట్ల మేరకు తగ్గిపోయింది. ప్రీ బడ్జెట్ వీక్ ట్రేడ్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌పై ఆయన ప్రసంగం ప్రభావం చూపించిది. దేశ ఆర్థిక రేటు తగ్గినట్టు ప్రకటించడం మార్కెట్ వర్గాలను ప్రభావితం చేసింది. కిందటి రోజు సెన్సెక్ 17,824.48 పాయింట్ల ముగియగా బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే అది వందపాయింట్ల వరకు పడిపోయాయి.

ఉదయం 11.15 నిమిషాలకు 114.61 పాయింట్ల మేరకు తగ్గిన సెన్సెక్స్ 17,709.87 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ సైతం 30 పాయింట్ల మేరకు కోల్పోయింది. అయినప్పటికీ ఐటిసీ, సత్యం, హిందూస్థాన్ యూనీలీవర్, టీసీఎస్, డీఎల్‌ఎఫ్‌ కంపెనీలు ప్రధానంగా లాభపడగా. విప్రో, భారతి ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, హిండాల్కో, టాటా మోటార్ కంపెనీలు స్వల్పంగా లాభపడ్డాయి.

వెబ్దునియా పై చదవండి