వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు..?

శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (09:45 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శుక్రవారం లోక్‌సభలో 2008-09 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో వివిధ రంగాలతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపును మరికొంత పెంచే అవకాశాలు వున్నాయి. అలాగే లెదర్, టెక్స్‌టైల్ రంగాల్లో వీలైనంత మేరకు రాయితీలు కల్పించే అవకాశం వుంది. వివిధ రంగాలపై ఆదాయపన్ను రాయితీలు కురిపించ వచ్చని భావిస్తున్నారు. బ్యాంకులతో పాటు ఇతర మార్గాల నుంచి పొందే వడ్డీకి ఆదాయపన్నును మినహాయించ వచ్చని భావిస్తున్నారు.

బొగ్గు రంగంలో ప్రైవేటీకరణపై ఆంక్షలు విధించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్నులను తగ్గించడం, ఆదాయపన్ను పరిమితి పెంపు, కీలక రంగాల్లో ఎక్సైజ్ టాక్స్‌ను తగ్గించడం, నానాటికీ క్షీణించి పోతున్న వ్యవసాయ రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు రాయితీలు కురిపించడం, దీర్ఘకాలిక పెట్టుబడులను తగ్గించడం, సెస్‌లపై సర్‌జార్జిని తగ్గిచండ తదితర వాటికి చిదంబరం ప్రాధాన్యత ఇవ్వొచ్చని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి