వాలెంటైన్ స్పెషల్ గిఫ్ట్ ఆఫర్స్... లవర్ వదిలేసినవాళ్లకోసం... ఎక్కడ?

మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (18:51 IST)
ఆస్ట్రేలియాలోని ఒక జూ నిర్వాహకులు వాలంటైన్స్ డే ఆఫర్ ప్రకటించారు. సాధారణంగా వాలెంటైన్స్ డే ఆఫర్లు అంటే ప్రేమలో ఉండే వారికే అనుకుంటాము అయితే ఇక్కడ ఈ ఆఫర్ కేవలం లవర్ వదిలేసిన వారికేనట. ఈ ఆఫర్ పొందాలంటే తప్పనిసరిగా తమ లవర్‌తో బ్రేకప్ చెప్పి ఉండాలట.
 
ఈ ఆఫర్ ప్రకారం ఎవరైనా తమ మాజీ లవర్ పేరును, వదిలేసిన వాళ్లంటే ఇష్టపడని వాళ్ల పేరును అత్యంత విషపూరితమైన పాముకు పెట్టుకోవచ్చట. అయితే ఇందులో పాల్గొనాలంటే ప్రవేశ రుసుముగా ఒక ఆస్ట్రేలియన్ డాలర్ చెల్లించి, ఒక ఆన్‌లైన్ ఫారమ్ పూరించాలట. ఒకవేళ ఎవరైనా పెట్టిన పేరు సెలక్ట్ అయితే ఒక ఏడాది పాటు వారికి జూ ప్రవేశం ఉచితమట.
 
సాధారణంగా విడిపోయిన ప్రేమికులకు ఒకరిపై మరొకరికి చెప్పుకోలేని కసి, కోపం ఉంటాయి, మరి కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అయితే సరిగ్గా అలాంటి వాళ్లు తమ కోపాన్ని కొద్దివరకైనా తీర్చుకోవడానికి, డిప్రెషన్ నుండి బయటకు రావడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని అంటున్నారు జూ నిర్వాహకులు. అయితే ఎంట్రీ ఫీజ్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బును జంతువుల సంరక్షణ కోసం వినియోగించనున్నట్లు జూ అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు