వంటగది నిర్మాణానికి కొన్ని వాస్తు చిట్కాలు..?

గురువారం, 25 ఏప్రియల్ 2019 (12:10 IST)
ప్రతీ ఇంట్లో వంటగది ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. వంటగదులను ఫలానా దిక్కులోనే నిర్మించాలనే నిబంధనలు ఏవీ లేవు. వాస్తు ప్రకారం. ఓ వ్యక్తి సప్తచక్రాల నుండి సానుకూల శక్తిని పొందడానికి తనకు అనుకూలమైన దిక్కుల్లో ఎక్కువ సమయం గడపాలి. సాధారణంగా నిద్రపోవడం, పనిచేయడంలో ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాం. 
 
ఇళ్లల్లో గృహిణులు వంటగదిలో అధిక సమయం గడుపుతూ ఉంటారు. వారు తమకు అనుకూలమైన దిక్కులో నిలబడి వంట చేయాలని పండితులు చెప్తున్నారు. మరి వాస్తు ప్రకారం వంటగది ఏ దిక్కులో ఉంటే మంచిదో ఓసారి తెలుసుకుందాం...
 
వంటగది ఆగ్నేయంలో లేనట్లయితే.. కుటుంబానికి చెడు జరుగుతుందని చెప్తున్నారు. వాస్తు సిద్ధాంతులు ద్వారా గడిచిన కొద్ది రోజుల నుండి ఇది బాగా ప్రచారం జరిగి, ప్రజాదరణ పొందింది. వంట చేసేటప్పుడు, భార్య లేదా వంటచేసే వ్యక్తి విధిగా తూర్పుదిశలో ఉండాలి. 
 
సరళ వాస్తు ప్రకారం.. వంటగది ఆగ్నేయంలో ఉండాల్సిన అవసరం లేదు. వంటగది ఆశించిన దిక్కులో లేకపోవడం అనేది పెద్ద సమస్య కాదు. ఫ్లాట్‌లు, అపార్ట్‌మెంట్లలో వాస్తుకు అనుగుణంగా ఉన్న వంటగదిని పొందడం చాలా కష్టం. ఇక వంటగది ఆగ్నేయంలో లేకపోవడం వలన కలిగే ప్రభావాలను తొలగించడం కొరకు సరళవాస్తు సూచనల ప్రకారం చిన్నపాటి మార్పుచేర్పులు చేయవచ్చును. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు