గృహ నిర్మాణం ఇలా చేస్తే..?

శనివారం, 24 నవంబరు 2018 (12:28 IST)
సాధారణంగా గృహ నిర్మాణం కోసం సిద్ధం చేసుకున్న స్థలంలో కేవలం వాస్తుపరంగా ఇల్లు నిర్మించడం మాత్రమే శుభఫలితాలు కనపరచకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉపగృహాలు లేక శాలలు నిర్మించడం అవసరమవుతుంది. కొన్ని సందర్భాలలో ఇవి నిర్మించడం అశుభమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
 
పశ్చిమం, ఉత్తరంలో రెండు గృహాలు లేదా ఒక గృహం-ఒక శాల పనికిరావు. ఇది మృత్యువును సైతం కలిగించగలదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూలాలలో ఇంటి నిర్మాణం చేయకూడదు. ఉత్తరం, తూర్పు దిశల యందు కూడా రెండు నిర్మాణాలు పరమయిన పీడనకు, సకల అరిష్టాలకు మూలం అవుతుంది. వీటికితోడు వీధుల అమరిక మరింత అధ్వాన్న స్థితిని కలిగిస్తుంది.
 
ఉపగృహ నిర్మాణ నిర్ణయం చాలాముఖ్యమైనది. గృహ నిర్మాణంలో దోషం లేక పోయినా, ఉపగృహాల వలన కలిగే దోషాలలో చాలా కుటుంబాల్లో అశాంతి చోటుచేసుకుంటుంది. అనగా గృహాలకు మంచి చేయడానికిగానీ, చెడు చేయడానికి గానీ ఉపగృహాలకు సామర్ధ్యం ఉందని అర్థం. దోషనివారణ నిమిత్తం, ఉపగృహాలను ఆయుధం వలే ఉపయోగించుకోవచ్చు. ఇట్టి విశాస్త్రంలో అనుభమమున్న వాస్తు సిద్ధాంతిచే స్వయంగా పరిశీలింప చేసుకుని నిర్మించాలి.  
 
ఉపగృహాలే కదా అని చాలామంది నియమాను సారంగా కట్టక దుష్పలితాలు అనుభవిస్తున్నారు. ప్రధాన గృహాలకు ఎటువంటి నియమాలు అనుసరిస్తున్నామో వీటికి కూడా ఆ నియమాన్ని వర్తిస్తాయి. నివాస, అనుబంధ ఉపగృహాలను ప్రహరి గోడకు చేర్చి నిర్మించకూడదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు