ఈశాన్యము లోపించినట్లైతే ఏం జరుగుతుందో తెలుసా?

శనివారం, 2 జూన్ 2018 (18:01 IST)
పడమర సింహ ద్వారమునకు తగినంతగా ఈశాన్య స్థలం పెరిగి ఉండటం చాలా శుభప్రదము. ఈశాన్యము లోపించినట్లైతే ఐశ్వర్య వృద్ధి లోపించగలదు. వాయువ్యదిశలో వేరొక గృహము నిర్మింపదలచిన ఆ గృహము ప్రధాన గృహమునకంటే ఎత్తు అధికంగా ఉండాలి. ప్రధాన గృహము గర్భమున కంటే పల్లముగా ఉన్నను, సమానముగా ఉన్నను, యజమాని ఔన్నత్యము తగ్గిపోగలదు. 
 
నైరుతిదిశ వీలు కలిగినంత వరకు ఎత్తుగా ఉండటం మంచిది. ఈ దిశ పల్లముగా ఉన్నను, గోతులు ఉన్నను, అధికముగా పెరిగి ఉన్నను ఆ యజమానికి పుత్రసంతానముండదు. అలాగే ఆగ్నేయదిశ ఎత్తు కలిగివుండుట ఎంతో మేలు. ఈ దిశ పెరుగుట, పల్లముగా ఉండుట, గోతులు వంటివి ఉంటే భార్యానష్టము లేక భార్యతో సంబంధాలు లేకుండటం వంటి అశుభ ఫలితాలుంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు