ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు...(Video)

మంగళవారం, 29 మే 2018 (16:37 IST)
దేశ ప్రజలకు చల్లని కబురు. ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రం నుంచి కొమరిన్ ప్రాంతం మొత్తం ఈ రుతుపవనాలు విస్తరించాయి.
 
కేరళలోని మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లాం, అల్లపుజ, కొట్టాయం, కొచి, త్రిశూర్, కోచికోడ్, కాన్నూర్, తలశెరి, కుడులు, మంగళూర్ ప్రాంతాల్లో 48 గంటల్లో 2.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ 14 ప్రాంతాల్లో పడిన వర్షపాతం ఆధారంగా భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు చెబుతున్నారు.
 
రుతుపవనాలు విస్తరణ ఈసారి చురుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూన్ 7, 8 తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశించొచ్చు. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండటంతో అనుకున్న సమయం కంటే ఒకటి, రెండు రోజుల ముందుగానే రావొచ్చని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని అధికారులు అంటున్నారు. ఈ కారణంగా ఈ దఫా దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయని అంటున్నారు. వీడియో చూడండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు