మనీ ప్లాంట్ ఇంట్లో వుంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. సానుకూల తరంగాలను ప్రసరింపజేయడంలో మనీ ప్లాంట్ ముందుంటుంది. ఇంకా ఇంట్లోని గాలిని సైతం మనీ ప్లాంట్ శుభ్రపరుస్తుంది.
సున్నితమైన తీగలతో వేగంగా పెరిగే ఈ మొక్కను ఎక్కడబడితే అక్కడ పెంచరాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కను నిర్దిష్ట ప్రదేశంలో పెట్టినప్పుడే అది శుభఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఎలా పెంచాలంటే..?
కుండీ లేదా సీసాల్లో మనీ ప్లాంట్‌ను పెంచుకోవచ్చు.
రోజూ ఈ మొక్కకు నీరు పోయటం మరిచిపోకూడదు.
గణేశుడి ఆధిపత్య స్థానమైన ఇంటికి ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్‌ను పెంచడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి.
మొక్కకున్న ఎండిన, పసుపు రంగు ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకుంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.
మనీ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఈశాన్య మూలన ఉంచరాదు. దీనివల్ల ధననష్టం, అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.