అలాగే వాస్తు దోషాలు తొలగిపోతాయి. కానీ తూర్పు, పడమర దిశలో మనీప్లాంట్‌ను పెంచుకుంటే దంపతుల మధ్య వాదోపవాదాలు పెరుగుతాయి. ఎప్పుడూ భాగస్వాములు వాదోపవాదాలకు దిగుతారు. ఈ దిశలో మనీప్లాంట్ పెంచుకోకూడదని, తద్వారా దంపతుల మధ్య గొడవలు ఎక్కువవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనీప్లాంట్‌లోని ఆకులు నేలను తాకేలా వుండకుండా ఈ ప్లాంట్‌ను పెంచాలి.
ఎప్పుడూ ప్లాంట్‌లో నీళ్లుండేలా చూసుకోవాలి. ఇంకా మనీప్లాంట్ ఆకులు బాగా పెరిగినట్లైతే ఆ ఇంట ఎలాంటి దోషాలు లేవని గ్రహించాలి. ఈ చెట్టును అధిక వేడి, చలి, వర్షం తగిలే ప్రాంతాల్లో వుంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈశాన్య దిశలో మనీప్లాంట్‌ను పెంచుకోకూడదు. ఇలా పెంచుకున్నట్లైతే ధననష్టం, కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.