ఒక గృహాన్ని 3 లేదా 4 భాగాలుగా పంచుకోవచ్చా?

బుధవారం, 22 ఏప్రియల్ 2015 (17:59 IST)
ఒక గృహాన్ని 3 లేదా 4 భాగాలుగా పంచుకోవచ్చా? అనే ప్రశ్న వాస్తు నిపుణులు వద్దనే అంటున్నారు. ఒక ఇంటిని మూడు భాగాలుగా లేదా నాలుగు భాగాలుగా పంచుకోకూడదని... ఇట్లు చేసినట్లైతే ఒక భాగస్తునకు దరిద్ర్యం కాని, వంశక్షయం గాని కలుగుట సంభవించును. అట్లే ఒక భాగస్తుడు బాగుండి మిగిలిన వారికి కష్టనష్టాలు తప్పవు. 
 
ఒక గృహాన్ని భాగాలుగా విభజించుకోకుండా.. ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది. గృహావరణంలో తూర్పు-ఉత్తర- ఈశాన్యాలలో పెద్ద పెద్ద పెరళ్లు ఉంటే ఐశ్వర్యం, వంశవృద్ధి చేకూరుతుంది. ఓ గృహాన్ని భాగాలు చేసి పంచుకోవటం కంటే, ఇంటిని నేల మట్టం చేసి తిరిగి విడివిడిగా ఎవరికి వారే ఇళ్లు కట్టుకోవడం శ్రేష్ఠం. 
 
ఇకపోతే.. ప్రతి గృహానికి గర్భగోడలు పూర్తిగా పైకప్పును తాకే విధంగా ఉండాలి. పిట్టగోడలు పనికిరావు. కొందరు గృహ గర్భగోడలను సగం వరకు కట్టడం లేదా అలంకరణ నిమిత్తం మధ్యలో ఆపివేయుట వాస్తు ప్రకారం నిషిద్ధమని నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి