పడక గదిని అమర్చుకోవడం ఎలా..?

శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:00 IST)
ప్రతి గృహంలో నిర్మాణానికి చాలా సూత్రాలు పాటిస్తూ వస్తుంటాం. అలానే ఇంటి యజమాని సంతోషాన్ని రెట్టింపు చేసేది పడకగది. అటువంటి పడకగది నిర్మాణంలో నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పడకగదిలో మంచాన్ని మన ఇష్టం వచ్చినట్లు మన ఆరోగ్య, మానసిక విషయాలు మీదు చెడు ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.

పడకగది తలుపుకి ఎదురుగా మంచం ఉండకూడదు. మంచం తలుపులకి, కిటికీలకు ఎదురుగా ఉండరాదు. అందువలన వాటిద్వారా గదిలోని వచ్చే వెలుతురువలన మన నిద్రకు భంగం కలుగుతుంది.
 
అద్దాన్ని కానీ, డ్రెస్సింగ్ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు కానీ, కాళ్లవైపు కానీ ఉంచకూడదు. మనిషి నిద్రా సమయంలో ఆత్మ శరీరం నుండి విడివిడి గదంతా తిరుగుతుందని చైనీయుల విశ్వాసం. శరీరం నుండి ఆత్మ బయటకు రాగానే అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని కంగారు పడుతుంది. దానివలన లేనిపోని అనార్ధాలు కలుగుతాయి. నిద్రాసమయంలో ఆత్మ శరీరం నుండి బయట పడుతుందనే నమ్మకం మనదేశంలో ఎక్కువగానే ఉంది.
 
బుక్‌షెల్ఫ్, డ్రెస్సింగ్ టేబులు అంచుల నుండి వీచే సూటి గాలులు మనిషి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. బెడ్‌రూమ్‌లో అనవసరమైన చెత్త ఉంచకూడదు. పెట్టెలు, పుస్తకాలు ఉపయోగపడని గృహోపకరణాలు ఉండకూడదు. టెలివిజన్, రేడియో, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ సాధనాలు పడకగదిలో ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది. తద్వారా నిద్రకు భంగం కలుగదు. ఎట్టి పరిస్థితుల్లోను మంచాన్ని ఏటవాలుగా ఉండే సీలింగ్ కిందకాన, స్థంబాలు కిందకాని ఉండకూడదు. ఒకవేళ వీటికింద తప్పనిసరి పరిస్థితుల్లో మంచాన్ని వేసుకోవాల్సివస్తే రెండు వెదురు వేణువులను పైన వేలాడదీయండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు