వ్యాపార సంస్థల నిర్మాణాలకు వాస్తు సరిగా లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం షాపుల యొక్క యజమానుల గృహములను వాస్తు బాగుండి, బాగులేదు అనే విషయమును పక్కనబెట్టి, వాస్తు పరంగా షాపు గురించి చర్చిస్తే, షాపుకు వాస్తు సరిగా లేకపోతే వ్యాపారం జరుగదు, లేదా మందకొడిగా జరుగుతుంది.
అప్పులపాలు కావడం, అప్పులు, సరుకులు ఇచ్చిన ఆసామి డబ్బు కట్టమని నెత్తిమీద కూర్చోవడం, ఇతరులకు పూచీలు పడి చేయని పాపానికి మీరు డబ్బు కట్టడం, కొట్లాటలు, అప్పు ఇచ్చిన ఆర్థిక సంస్థల నుండి నోటీసులు రావడం, కోర్టులో కేసులు వేయడం, ప్రభుత్వ సంస్థల నుండి అధికారులు తనిఖీలకు వచ్చి బాగా ఇబ్బంది పెట్టడం, జరిమానాలు వేయడం, షాపు సీజ్ కావడం, అవమానం ఇతరత్రా ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల దిగువ తెలిపిన విధంగా వుంటే సరిపోతుంది.