పెద్దలు కుదిర్చిన పెళ్లికి సై అన్న హీరోయిన్...

మంగళవారం, 5 నవంబరు 2019 (16:18 IST)
దశాబ్దకాలంగా టాప్ హీరోయిన్‌గా వెలిగిన కాజల్ అగర్వాల్ 2005‌లో టాలీవుడ్‌లో చందమామ సినిమాతో అడుగుపెట్టింది. ఇటీవలి కాలంలో కాస్త ఫేడ్ అవుట్ అయ్యినందున కెరీర్ కాస్త నెమ్మదించింది. ఇప్పటికి చాలాసార్లు కాజల్ పెళ్లి గురించి వార్తలు వినిపించినప్పటికీ అంతగా ప్రాధాన్యం దక్కలేదు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
 
పెద్దలు కుదిర్చిన పెళ్లికి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, ఓ వ్యాపార వేత్తను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు సన్నిహిత వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం. కెరీర్ బాగున్నప్పుడే జీవితంలో సెటిల్ కావాలనే నిర్ణయాన్ని తీసుకొన్నట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటికే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా కాజల్ స్వంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించాలని ప్రయత్నాలు చేస్తున్నది. అంతేకాకుండా దానికి KA ఫిల్మ్స్ అనే పేరును కూడా పెట్టినట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ఇటీవల వెల్లడించారు. అయితే పెళ్లి ప్లాన్ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ ప్రొడక్షన్ పనులలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు