వీధులు.. ఇంటి ప్లాటు కంటే ఎత్తులో ఉండొచ్చా?

శనివారం, 28 జూన్ 2014 (16:33 IST)
సాధారణంగా గృహాలను నిర్మించుకునే సమయంలో వీధి పోటును నిశితంగా పరిశీలిస్తారు. అలాగే, నిర్మించే ఇల్లు వీధి కంటే ఎక్కువగా ఉండేలా చూస్తుంటారు. ఇలాంటి వీధులు ఇంటి కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఏవైనా దోషాలు ఉంటాయన్న సందేహం ఉంటుంది. దీనిపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే వారు కింద విధంగా సమాధానం చెపుతున్నారు.
 
పడమర దక్షిణ వీధి కలిగిన ప్లాట్లలో సెల్లార్లు లేక పల్లంగా ఉన్నా బాగా లాభిస్తాయి. అదేవిధంగా తూర్పు, ఉత్తర వీధులను సరించి నిర్మాణాలకు సెల్లార్లు అంతగా యోగించటం లేదు. అందుకని ప్లాటుకు పడమర వాయవ్యంలో సింహద్వారం ఏర్పరచుకుని, పడమర వీధి నుంచి రాకపోకలు చేయాలని సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి