కొత్త ఇంటి స్థలం కొనాలకుంటున్నారా.. అయితే వీటి ప్రకారం ఇంటి స్థలం కొనుక్కుంటే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీధిచూపు పూర్తిగా ఈశాన్యంలో కాకుండా కొంత స్థలం వదిలి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంటి నిర్మాణం చేయాలి. ఒకవేళ స్థలం ఎక్కువగా ఉంటే ఇల్లు కట్టేటప్పుడు వీధి కనపడకుండా కాస్త దూరంగా ఉండేలా చూసుకోవాలి.
అయినా కూడా వీధి కనిపిస్తుంటే వీధిచూపు వరకు ఉంచుకుని మిగిలిన స్థలాన్ని తీసుకోకుండా కొద్దిగా దూరంగా ఉన్న స్థలంలో కట్టుకుంటే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీధికి ఎత్తునే ఇల్లు ఉండాలి కానీ వీధి కిందకు ఇల్లు ఉండకూడదు కనుక వీలైనంత వరకు ఇంటి స్థలం వీధికి దూరంగా ఉండేలా తీసుకోవడమే మంచిది. ఇలా ఇంటి స్థలం తీసుకోవడం అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.