కుంకుమ పువ్వుతో పలావ్ చేస్తే..?

FILE
కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గిస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు కుంకుమ పువ్వును అధికంగా ఉపయోగిస్తారు. అలాంటి కుంకుమ పువ్వుతో పలావ్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు :
బాస్మతి రైస్ - రెండు కప్పులు
కుంకుమ పువ్వు - పావు టీ స్పూన్
పంచదార - రెండు టీ స్పూన్లు
జీడిపప్పు, పిస్తా, బాదం, ద్రాక్ష - ఒక్కో స్పూన్ చొప్పున నాలుగు స్పూన్లు
యాలకులు, దాల్చిన చెక్క - రెండేసి
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు
పాలు - అర గ్లాసు
మిరపపొడి - కాసింత
ఉప్పు - తగినంత

తయారీ విధానం :
ముందుగా పాలులో కుంకుమ పువ్వు వేసి కరిగాక, ఉప్పు, పంచదార చేర్చాలి. బాస్మతి రైస్‌ను ఉడికించి ఆరబెట్టుకోవాలి. ఇందులో పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు మిశ్రమాన్ని కలపాలి. బాణలిలో నెయ్యి పోసి కాగాక యాలకులు, దాల్చిన చెక్క వేగాక నట్స్‌లను చేర్చి దోరగా వేపుకుని ప్లేటులోకి తీసుకోవాలి.

తర్వాత మిగిలిన నట్స్, మిరపపొడిని ఆరబెట్టిన అన్నంలో వేసి కలుపుకోవాలి. ఈ అన్నాన్ని నెయ్యి రాసిన బేకింగ్ పాత్రలోకి తీసుకుని ఓవన్లో లేదా మైక్రో ఓవెన్లో ఐదు నిమిషాలుంచి, వేపి పక్కన బెట్టుకున్న నట్స్‌తో అలంకరించుకోవాలి. తర్వాత హాట్ హాట్‌గా టమోటా లేదా చిల్లీ సాస్‌, చికెన్ గ్రేవీలతో సర్వ్ చేయండి.

వెబ్దునియా పై చదవండి