విటమిన్ ఎ, మినరల్స్ పుష్కలంగా ఉన్న క్యారట్‌తో వర్షాకాలంలో సూప్ సిప్ చేస్తే ఎలా ఉంటుంది.. అయితే క్యారట్ సూప్ ఎలా చేయాలో చూద్దామా..
కావలసిన పదార్థాలు: క్యారట్ - పావు కేజీ ఉల్లిపాయ - రెండు. పెసరపప్పు - ఒక టేబుల్ స్పూన్. వెన్న తీసిన పాలు - ఒక కప్పు. ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.
తయారీ విధానం: ముందుగా క్యారట్, ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కల్లో పెసరపప్పు, మూడు టీ స్పూన్ల నీటిని వేసి ఫ్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ఒంపుకోవాలి.
ఇందులో వేడిపాలను వేసి బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి కలిపి ఒక నిమిషం సేపు ఉడికించి దించేయాలి. దీనిని వేడివేడిగా సర్వ్ చేయాలి.