టమోటాతో పెరుగుకూర ఎలా చేస్తారు?

FILE
టమోటా, పెరుగులో చాలా పోషకాలున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. మరి పిల్లలకు నచ్చే టమోటా పెరుగు పులుసు ఎలా చేయాలో చూద్దామా.

కావలసిన పదార్థాలు:
టమోటా - పావుకిలో.
ఉల్లిపాయలు - రెండు.
పచ్చిమిర్చి - ఆరు.
పెరుగు - ఒక కప్పు.
ఉప్పు - తగినంత.
పసుపు - చిటికెడు.

పోపు సామాగ్రి:
ఎండు మిర్చి - రెండు
ఆవాలు - పావు టీస్పూన్‌.
వెల్లుల్లి - మూడు రేకలు.
కరివేపాకు - కొద్దిగా.
నూనె - 50 గ్రా.
మినపప్పు - అర టీస్పూన్‌.

తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు ముక్కలు తరగాలి. ఇవి చాలా చిన్న ముక్కలుగా ఉండాలి. బాణలిలో నూనె మరిగాక ఆవాలు వేసి చిటపటలాడాక ఎండు మిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేయించి, టమోటా ముక్కలు, ఉప్పు వేసి బాగా మరిగించి, పెరుగు వేసి కలిబెట్టి దించాలి. కొద్దిగా కొత్తి మీర వేసుకుంటే రుచి అదిరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి