బెండకాయ వేపుడు ఎలా చేయాలి?

FILE
జ్ఞాపకశక్తిని పెంచే బెండకాయల్ని వారానికి రెండుసార్లు పిల్లలకు పెట్టడం మంచిదంటున్నారు న్యూట్రీషన్లు. బెండకాయను పులుసుల్లో వేస్తే ఇష్టపడి తినరు. అయితే వేపుళ్ల రూపంలో ఇష్టపడి తింటారు. అలాంటి బెండకాయ వేపుడు ఎలా చేయోలో చూద్దామా..

కావలసిన పదార్థాలు:
బెండకాయలు - పావు కిలో.
నూనె - వేయించడానికి సరిపడినంత.
కారం - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.

తయారీ విధానం:
బెండకాయలను వేపుడుకు వీలుగా ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ముక్కలకు సరిపడినంత కారం, ఉప్పు, అరస్పూన్ నూనెలో వేయించి కలుపుకోవాలి.

వెబ్దునియా పై చదవండి