సాయంవేళల్లో సరికొత్త స్నాక్స్ "సోయా పాలక్"

FILE
కావలసిన పదార్థాలు :
సోయా పౌడర్.. రెండు కప్పులు
తరిగిన పాలకూర.. నాలుగు కప్పులు
జీలకర్ర.. రెండు టీ.
కొబ్బరి తురుము.. ఒక కప్పు
అల్లం, వెల్లుల్లి.. నాలుగు టీ.
ఉల్లిపాయ తరుగు.. రెండు కప్పులు
పచ్చిమిర్చి తరుగు.. కాస్తంత
బ్రెడ్ పౌడర్.. రెండు కప్పులు
వంటసోడా.. అర టీ.
ఉప్పు, నూనె.. సరిపడా

తయారీ విధానం :
సోయా పౌడర్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులు.. కొబ్బరి తురుము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, తరిగిన పాలకూర, వంటసోడా, తగినంత ఉప్పు చేర్చి నీటితో మెత్తని పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి మరుగుతుండగా.. పైన తయారుచేసిన పిండి కొద్ది కొద్దిగా తీసుకుని బ్రెడ్ పౌడర్‌లో దొర్లించి కాగుతున్న నూనెలో పకోడీల్లాగా వేయాలి. బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి న్యూస్ పేపర్‌పై వేయాలి. అంతే వేడి వేడి సోయా పాలక్ స్నాక్స్ తయార్. వీటిని కొబ్బరి పచ్చడి లేదా గ్రీన్ చట్నీతో కలిపి తింటే అదిరిపోయే రుచితో అలరిస్తాయి.

వెబ్దునియా పై చదవండి