సేమియా కట్‌లెట్ టేస్ట్ చేసి చూడండిలా..!!

మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (15:34 IST)
FILE
కావల్సిన పదార్థాలు :

సేమియా - రెండు కప్పులు,
బ్రెడ్ ముక్కలు - నాలుగు,
క్యారెట్ - ఒకటి,
బీన్స్ - యాభై గ్రాములు,
బంగాళాదుంపలు - రెండు,
ఉల్లిపాయ తరుగు - కప్పు,
కొత్తిమీర, పుదీనా - తగినంత,
మిరియాలపొడి - అర చెంచా,
పచ్చిమిర్చి - నాలుగు,
నూనె - అరకప్పు,
ఉప్పు - రుచికి సరిపడినంత

తయారీ విధానం :

ఉడికించిన బంగాళాదుంపలను చేత్తో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. అలానే మరో గిన్నెలో నీళ్లు పోసి అందులో చెంచా నూనె, కొద్దిగా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత సేమియా వేయాలి. సేమియా బాగా ఉడికిన తర్వాత నీళ్లు ఒంపేసి, అందులో ఉడికించిన బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్ ముక్కలు, ఉప్పు మిరియాలపొడి, బ్రెడ్‌పొడి చేర్చి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కట్‌లెట్‌ విధంగా చేత్తో పొడవుగా చేసుకోవాలి. తరువాత బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక కట్‌లెట్ వేయాలి. బంగారువర్ణంలోకి వచ్చాక దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన సేమియా కట్‌లెట్ రెడీ. వీటిని టమాటాసాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి