స్థూలకాయానికి చెక్ పెట్టే "బొప్పాయి సాస్‌"

శనివారం, 22 మార్చి 2014 (13:18 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
బొప్పాయి పండు ముక్కలు.. ఒక కేజీ
పంచదార.. పావు కేజీ
సోడియం బెన్‌టోజ్.. ఒక టీ.
సిట్రిక్ యాసిడ్.. ఒక టీ.
గరంమసాలా.. 5 గ్రా.
లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్ప.. తగినంత

తయారీ విధానం :
ఓ మోస్తరుగా పండిన బొప్పాయి పండును తీసుకుని చెక్కుతీసి ముక్కలుగా కోసి, ఒక పాత్రలో వేసి వేడిచేయాలి. తర్వాత వాటిని గుజ్జుగా చేసి ఓ పల్చటి వస్త్రంలో పోసి వడబోయాలి. ఒక గిన్నెలో సగం పంచదారను తీసుకుని, దాంట్లో కాసిన్ని నీళ్లుపోసి బాగా మరిగించాలి. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్కలను దంచి ఈ పొడిని పంచదార పాకంలో వేయాలి. అలాగే గరంమసాలా పొడిని కూడా వేసి కలియబెట్టాలి.

ఈ మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత దించి తగినంత ఉప్పు, సోడియం బెన్‌టోజ్, సిట్రిక్ యాసిడ్, మిగిలిన పంచదారనును వేసి బాగా కలియబెట్టి, మరిగించాలి. తరువాత దించి చల్లార్చి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. అంతే పపయా సాస్ రెడీ. వారం రోజులదాకా నిల్వ ఉండే ఈసాస్‌ను బ్రెడ్‌తో కలిపి తినవచ్చు.

ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక, కొందరికి రుచించదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకూ, ఆదర్శభోజనం తీసుకునే వారికీ, ఇది మంచి ఆహారం. ప్రతీరోజూ ఓ బొప్పాయి పండు తీంటే స్థూలకాయం బాగా తగ్గిపోతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది కూడా.!

వెబ్దునియా పై చదవండి