రుచికరమైన అరటికాయ పచ్చడి

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:34 IST)
కావలసిన వస్తువులు:
అరటి కాయలు (పచ్చివి) - 2
పచ్చిమిర్చి  - 4, 
ఎండుమిర్చి - 6
ఆవాలు, జీలకర్ర, మినప్పు కలిసి - 2 టీ స్పూన్లు
పచ్చి శనగపప్పు - టీ స్పూను
కొత్త మీర - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు  
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు 
ఇంగువ - కొద్దిగా 
నానబెట్టిన చింతపండు - కొద్దిగా
పల్లీల పొడి - మూడు టీ స్పూన్లు
 
తయారుచేయండి ఇలా : అరటి కాయ పచ్చడి తయారీకి మొదట అరటి కాయలను స్టౌ మీద కాల్చాలి. చల్లారిన తరువాత పైన ఉన్న తొక్కను తీసి ముక్కలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. చివరిగా ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు వేసి మరో మారు వేయించాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి తిప్పాలి. మెత్తగా అయ్యాక ఉప్పు. చింతపండు, అరటి కాయ ముక్కలు వేసి తిప్పాలి. పచ్చడిని బౌల్‌లోకి తీసుకుని, పల్లీల పొడి వేసి కలపాలి. కొత్తమీర, కరివేపాకు గార్నిష్ చేసుకుంటే సరి. అంతే రుచికరమైన అరటికాయ పచ్చడి రెడీ. దీన్ని టిఫిన్‌లోకికానీ, అన్నంలోకి కానీ, అలేగే అయినా, కాసింత నెయ్యి వేసుకుని అయినా ఆరగించవచ్చును. 
 

వెబ్దునియా పై చదవండి