షాజీరా - 1 స్పూన్
తయారీ విధానం:
ముందుగా బియ్యం కడిగి పొడి పొడిగా వుండేట్లు అన్నం ఉడికించుకోవాలి. బాణలిలో నూనెను పోసి వేడయ్యాక మసాల దినుసులు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి కూడా వేసి వేగించి టమోటా, పనీర్ ముక్కలు వేసి మూతపెట్టుకోవాలి. 5 నిమిషాల తరువాత క్యాప్సికం ముక్కలు కలపాలి. క్యాప్సికం రంగు మారకుండానే అన్నం కలుపుకుని కాసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి. అంతే... వేడివేడి క్యాప్సికమ్ రైస్ రెడీ.